విశాఖపట్నం లోని Residential Lands మీద పెట్టుబడి, సురక్షితమైన భవిష్యత్తుకి వేసే బంగారు విత్తనం. ఎందుకు

విశాఖపట్నం లోని Residential Lands మీద పెట్టుబడి, సురక్షితమైన భవిష్యత్తుకి వేసే బంగారు విత్తనం. ఎందుకు

విశాఖపట్నం లోని Residential Lands మీద పెట్టుబడి, సురక్షితమైన భవిష్యత్తుకి వేసే బంగారు విత్తనం. ఎందుకు

 

విశాఖపట్నం లోని Residential Lands మీద పెట్టుబడి, సురక్షితమైన భవిష్యత్తుకి వేసే బంగారు విత్తనం. ఎందుకు

 

వైజాగ్ అని కూడా పిలువబడే విశాఖపట్నం ఎన్నో ప్రాముఖ్యతలను, ఆకర్షణలు కలిగివున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఓడరేవు నగరం. తూర్పున బంగాళాఖాతం ఉండటం వలన వైజాగ్ నగరంలో ప్రసిద్ధి చెందిన బీచ్ లతో పాటు, ఎన్నో పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో, వైజాగ్ లో అభివృద్ధి శరవేగంగా పెరుగుతుండడంతో పాటు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు కూడా ఆశారీతిన పుంజుకుంటున్నాయి. ఈ అభివృద్ధి యొక్క ప్రభావం వైజాగ్ పరిసర ప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళం మరియు తూర్పు గోదావరి వంటి పట్టణాలపైనా కూడా చూపిస్తూ, ఆయా పట్టణాలలోని రియల్ ఎస్టేట్ రంగంకి కొత్త ఊపిరిలందిస్తున్నాయి. ఇప్పుడు గానీ త్వరపడకుంటే, రానున్న రోజుల్లో వైజాగ్ లోని residential lands మీద పెట్టుబడులు పెట్టడం అనేది తలకుమించిన భారంగా అవుతుందని మార్కెట్ విశ్లేషకుల గట్టి అభిప్రాయం.

విశాఖపట్నం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలంటే, ఇది భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న ఏకైక సహజసిద్ధమైన నౌకాశ్రయంగా ప్రసిద్ధి చెంది, భారతదేశంలోనే 5 వ అత్యంత రద్దీగా ఉండే పోర్టుగా ప్రాముఖ్యతను సంచరించుకుంది. ఇక్కడ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కూడా ఉండటంతో, స్వచ్ఛతకు విలువనిచ్చే నగరంగా పేరొంది, స్మార్ట్ సిటీస్ మిషన్ కింద స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయబడుతున్న భారతీయ నగరాలలో ఒకటిగా ఎంపిక చేయబడింది.  వైజాగ్ నగరం అద్భుతమైన ఇంఫ్రాస్ట్రుక్చర్ సదుపాయాలను కలిగివుండటం చేత, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ, ఐటి ఇండస్ట్రీ వంటి గొప్ప లాభదాయకమైన రాబడులను అందించే ప్రముఖ పరిశ్రమలకు అనువైన కేంద్రంగా అవతరించింది.

 

స్వచ్ఛత గుర్తింపు పొందిన స్మార్ట్ సిటీగా పేరెన్నిక

వైజాగ్ ఓడరేవు ఆగ్నేయాసియా మార్కెట్లకు ఉత్పత్తుల రవాణాకు ప్రధానమైన గేట్‌వేగా పనిచేస్తుంది. దీనితో పాటుగా ఇంట్రా & ఇంటర్‌సిటీ రోడ్ మరియు రైల్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలను కలిగివుండటం చేత, ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రధాన నగరాలతో సులువుగా అనుసంధానించబడినది. ఇంకొక ప్రస్తావించవలసిన విషయం ఏమిటంటే మన దేశంలోనే 75 రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో వైజాగ్ రైల్వే స్టేషన్ అత్యంత పరిశుభ్రమైనది. ఇదివరకిటితో పోలిస్తే, వైజాగ్ నగరం స్మార్ట్ సిటీగా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అనేది ముమ్మాటికీ నిజం. కాలుష్య నివారణకు విశేషమైన కృషి చేస్తూ, నగరంలోని 22 ప్రదేశాలలో గల ప్రభుత్వ భవనాలలో సోలార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

 

అత్యున్నతమైన నాణ్యత వనరులు

వైజాగ్ నగరం అభివృద్ధికి మచ్చుగా ఒక కారణం చెప్పాలంటే, ఈ నగరం కలిగివున్న అత్యున్నతమైన నాణ్యత వనరులు అని చెప్పొచ్చు. ప్రపంచస్థాయి విద్యాసంస్థలు, ఆధునిక పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలు, అధిక నాణ్యత కలిగిన సహజ వనరులు మరియు మౌలిక సదుపాయాలను కలిగివుండటం చేత, పాశ్చ్యాత దేశాల నుండి కూడా వివిధమైన పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ యొక్క పెట్టుబడులను మరింతగా సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విధానాలను ప్రవేశపెట్టడం చేత, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెరిగి, పొరుగున ఉన్న నగరాల నుండి నగరానికి వచ్చే ప్రజల సొంతింటి కలలను నిజం చేసేందుకు డిమాండ్ కూడా పెరుగుతుంది.

 

సీజన్తో పాటు మారని ఆహ్లదకరమైన వాతావరణం

సముద్రపు ఒడ్డున ఉండటం వలన వైజాగ్ నగరం యొక్క వాతావరణం తేమతో ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రత మాత్రం తక్కువగా ఉండి, ఆహ్లదభరితంగా ఉంటుంది. పని ఒత్తిడిలో ఉన్న వారెవరైనా సరే, సాయంత్రం పూత ఒక గంట ఆలా బీచ్ ఒడ్డున నడిచారంటే చాలు అలసట మచ్చుకైనా అగుపడదు. అంతేకాకుండా తరచుగా కురిసే వర్షాలు కూడా వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉండటం చేత, సీజన్‌తో సంబంధం లేకుండా నగరం ఆహ్లాదభరితంగా ఉంటుంది.

 

పూర్తి వినోదాలకు నెలవు

వినోదాన్ని ఆస్వాదించేవారెవరైనా వైజాగ్ నగరాన్ని సందర్శించాల్సిందే. వైజాగ్ లోనే కాదు, చుట్టుపక్కలే ఉన్న భీమిలి, అరకు వంటి సౌందర్య ప్రదేశాలు ప్రకృతిని ప్రేమించేవారిని పరవశింపులని చేస్తాయంటే అతిశయోక్తి కాదు. ఫ్యామిలీతో జాలీగా గడిపేందుకు ఎన్నో హ్యాంగౌట్ లొకేషన్స్ ఎన్నో ఉండటం చేత, మేము వాటిని మా తదుపరి ఆర్టికల్ లో పూర్తిగా విశ్లేషిస్తాము. గత కొన్నేళ్లుగా సినిమా షూటింగ్స్ కి నెలవుగా మరీనా వైజాగ్ నగర పరిసరాలలో రానున్న కొద్దికాలంలోనే ఫిలింసిటీ రాబోతుండటంతో, చుట్టుపక్కల పరిసరాల్లోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

పైన పేర్కొన్న కారణాలు వైజాగ్ లోని residential lands మీద మీరు చేసే పెట్టుబడికి ఎంతటి విలువని అందిస్తుందో తెలపడంతో పాటుగా, మీ సురక్షితమైన భవిష్యత్తుకి వేసే బంగారు విత్తనం అవుతుంది. ఇక్కడ మీరు చేసే పెట్టుబడి, మీ నిజమైన ఆస్థి అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కాబట్టి, ఇక్కడి భూముల ధరలకు రెక్కలు రాకమునుపే, త్వరపడి మీ పెట్టుబడుల ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. మీరు వేచివుండే కొద్ది, మీరు అదనంగా వెచ్చించాల్సిన అవసరం ఏర్పడుతుందనే విషయం గమనించండి. ఒకవేళ మీరు ఇక్కడి భూములపైన పెట్టుబడుల్ని పెట్టాలనుకొని, సరైన residential plots కోసం చూస్తుంటే, మీ బడ్జెట్‌కి తగినట్లుగా మీరు ఉత్తమ రెసిడెన్షియల్ ప్లాట్‌ల కోసం చూస్తున్నట్లయితే, మీ పనిని మరింత సులువు చేసేందుకు భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అత్యంత ప్రసిద్ధమైన, విశ్వసనీయమైన ప్రాపర్టీ డెవలపర్‌లను మేము సిఫార్సు చేస్తున్నాము. మీరు చేసే పెట్టుబడిలోని ప్రతిదశలో మీకు అనువుగా కొనుగోలు ప్రక్రియని సులభతరం చేసేందుకు వైజాగ్‌లోని నమ్మకమైన property developers తో మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి ఇప్పుడే మాతో కనెక్ట్ అవ్వండి.

© 2023 Rera News. All rights reserved.